Yarlagadda: కాయ్ రాజా కాయ్.. యార్లగడ్డ పార్టీ మార్పుపై బెట్టింగ్!
గన్నవరం రాజకీయాలు హీటెక్కుతున్నాయి. యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతుండగా.. ఇవాళ ఆ విషయం గురించి ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. గన్నవరం నియోజకవర్గంలోని దాదాపు 2,000మంది కార్యకర్తలతో ఆయన భేటీ అవుతున్నారు. ఈ మీటింగ్ తర్వాత తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తారన్న ఉహాగానాలు వినిపిస్తున్నాయి.