నేను ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తను.. నా జీవితం కాంగ్రెస్‌కే అంకితం
తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై MP ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. తనపై కొందరు కాంగ్రెస్ నాయకులే తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని బాంబు పేల్చారు. వారికి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు తనను టార్గెట్ చేస్తున్నాయన్నారు. తాను 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్లు వెల్లడించారు. తన చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు