UNION BUDGET 2025: AIకి పెద్ద పీట.. భారీగా కేటాయింపులు
దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాలను నెలకొల్పేందుకు భారీగా నిధులు కేటాయించింది. ఏఐ కేంద్రాల కోసం రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఏఐ పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.