Hyderabad: మాధవీలతకు ఆలింగనం.. ఏఎస్సై కి షాక్ ఇచ్చిన సీపీ!
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతను అలింగనం చేసుకున్న సైదాబాద్ ఏఎస్సై ఉమాదేవి సస్పెండ్ అయ్యారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే చట్టాన్ని ఉల్లఘించినందుకు తాత్కాలికంగా విధులనుంచి తొలగిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.