ఆంధ్రప్రదేశ్అడవి బిడ్డల దుస్థితి మారాలి.. ఎమోషనల్ అయిన పవన్ కళ్యాణ్ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరి పుత్రులకు ప్రేమ పూర్వక శుభాకాంక్షలు చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కొండకోనలు దాటి రావడానికి ఇష్టపడని ఈ అడవి బిడ్డలకు అనారోగ్యం చేసినా, ప్రసవానికి ఆస్పత్రికి వెళ్ళాలన్నా ఆ బాధలు వర్ణనాతీతమని పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. అడవి బిడ్డలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. కొండకోనల్లో నివసిస్తూ సంప్రదయాలను బతికించుకుంటున్నారని తెలిపారు. అడవి తల్లిని నమ్ముకున్న బిడ్డలు, కళ్లా కపటం ఎరుగని మనుషులు మన గిరిజనులని చెప్పారు.. By E. Chinni 09 Aug 2023 11:31 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn