TTD: తిరుపతి శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక!
శుక్రవారం నాడు తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి డిసెంబర్ కోటా టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలను టీటీడీ తెరవనుంది.
శుక్రవారం నాడు తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి డిసెంబర్ కోటా టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలను టీటీడీ తెరవనుంది.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.ఉదయం వరహ పుష్కరిణిలో స్వామి వారి చక్రస్నాన మహోత్సవాన్ని పండితులు వేడుకగా ప్రారంభించారు. స్వామి వారికి శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమంజనాన్ని నిర్వహించనున్నారు.
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు అయిన శనివారం ఉదయం …. శ్రీ మలయప్పస్వామిని సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. భక్తుల కోలాహలం మధ్యన శ్రీవారు భూదేవీ సమేత మలయప్ప స్వామిగా స్వర్ణ రథంలో ఊరేగారు.
కలియుగ ప్రత్యక్ష దైవం..అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ తిరుమల (tirumala) వెంకటేశ్వర స్వామి (venkateswara swami) వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం ఉదయం స్వామి వారికి సింహ వాహన(Simha Vahana seva) సేవ నిర్వహించారు.
తిరుమల (tirumala) శ్రీవారి (Srivari) ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ఆదివారం ప్రారంభం అయ్యాయి. ఉత్సవాల్లో మొదటి రోజు స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతుడై మలయప్ప స్వామిగా పెద్ద శేష వాహనం పై భక్తులకు దర్శనమిచ్చారు. రెండో రోజు స్వామి చిన్న శేష వాహనం పై భక్తులకు దర్శనం ఇ్వనున్నారు.
తిరుమలలో 9 రోజుల పాటు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలలో అక్టోబరు 19న గరుడ వాహన సేవ, అక్టోబర్ 20న పుష్పక విమానం, అక్టోబర్ 22న స్వర్ణ రథోత్సవం, అక్టోబర్ 23న చక్రస్నాన మహోత్సవం సహా పలు విశిష్ట కార్యక్రమాలు ఉంటాయి. 19 సాయంత్రం 6:30కు శ్రీవారి గరుడోత్సవం జరగనుంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. టీటీడీ అధికారులు, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కసర్ రెడ్డి తదితరులు శోభమ్మకు ఘనం స్వాగతం పలికారు. దగ్గరుండి శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారి అర్చనలో పాల్గొన్నారు. స్వామివారికి శోభమ్మ తలనీలాలు సమర్పించుకున్నారు.
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల షెడ్యూల్ను టీటీడీ వెల్లడించింది. ఈనెల 15 నుంచి 23 వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల ఆరంభం నుంచి ముగింపు రోజు వరకు అష్టాదళ పాదపద్మారాధన,ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, తిరుప్పావడ, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.
ఈనెల అక్టోబర్ 29వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ కారణంగా 8గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1.05 నుంచి 2.:22గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఈ కారణంగా 28 వతేదీ రాత్రి 7గంటల నుంచి ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.