Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ ముందు పొంగులేటి కొత్త కండిషన్.. 10 కాదు 13 టికెట్లు ఇవ్వాలని డిమాండ్?
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి కాంగ్రెస్ హైకమాండ్ వద్ద మరో కొత్త ప్రతిపాదన పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. మొత్తం 13 నియోజకవర్గాల్లో తాను సూచించిన వారికి టికెట్ ఇవ్వాలని పొంగులేటి కోరారని తెలుస్తోంది. ఆ నియోజకవర్గాల్లో తాను సూచించిన వారికి టికెట్ ఇస్తే వారిని గెలిపించి గిఫ్ట్ గా ఇస్తాని ఆయన చెప్పినట్లు సమాచారం.