Telangana: కేసీఆర్ను ఓడించే మొగోడు రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కామారెడ్డిలో కేసీఆర్ను ఓడించే మొగోడు రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సాధించే తొలి విజయం కామారెడ్డే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ తిన్నదంతా కక్కిస్తామన్నారు జీవన్ రెడ్డి. ప్రాజెక్టు విషయంలో కేసీఆర్కు అవగాహన లేకపోతే.. ఇంజనీర్లకు లేదా? అని ప్రశ్నించారు. ఈఎన్సీ మురళీధర్ రావును జైల్లో వేయాలని డిమాండ్ చేశారు.