PM Modi vs CM KCR: ఎన్డీఏలోకి వస్తానంటే వద్దన్నా.. కేటీఆర్ ను ఆశీర్వదించమంటే నో చెప్పా.. కేసీఆర్ టాప్ సీక్రెట్స్ రివీల్ చేసిన మోదీ
ఇందూరు వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ అవినీతి భాగోతాన్ని బయటపెట్టానని అన్నారు. కర్నాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్కు ఫండింగ్ చేశారని ఆరోపించారు. అదే తరహాలో ఇప్పుడు తెలంగాణలోనూ నోట్లు పంచేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు ప్రధాని మోదీ. అంతేకాదు.. ఎన్డీయేలో చేరుతానంటూ కేసీఆర్ తమ వద్దకు వచ్చారని ప్రధాని మోదీ వెల్లడించారు.