Telangana: కేసీఆర్ కాంగ్రెస్ మెనిఫెస్టోను కాపీ కొట్టారు.. కోమటి రెడ్డి కీలక వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగలేదని.. అందుకోసమే సోనియా గాంధీ తమతో చర్చించిన తర్వాత ఆరు గ్యారెంటీలు ప్రకటించాలని సూచించినట్లు తెలిపారు. ఇంతవరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కూలీలను పట్టించుకోలేదని.. కానీ తమ మెనిఫెస్టోలో రైతు కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయం ప్రకటించామని అన్నారు.