Telangana Elections 2023: అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. అమిత్ షా సంచలన ప్రకటన..
బీజేపీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. వరంగల్లో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ప్రశ్నాపత్రాల లీకేజీతో యువత జీవితాలతో ఆడుకున్నారని విమర్శించారు.