Telangana Liberation day: రజాకార్లపై పోరాటానికి ముందు పాక్ ప్రధానికి నెహ్రు టెలిగ్రామ్.. నిజాం పీడ వదిలిన రోజు!
హైదరాబాద్ నిజాంను గద్దె దింపిన రోజు రానే వచ్చింది. మన సంస్థానాన్ని భారత భూభాగంలోకి తీసుకురావడానికి ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ జరిగి సెప్టెంబర్ 17, 2023నాటికి 75 ఏళ్లు పూర్తయ్యాయి. 'ఆపరేషన్ పోలో', 'ఆపరేషన్ క్యాటర్ పిల్లర్'తో నిజాంని భారత్ సైన్యం తరిమికొట్టింది. నాటి ప్రధాని నెహ్రూ, అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో రజాకార్లపై మొదలైన యుద్ధం ఐదు రోజుల్లోనే ముగిసింది. ఈ సైనిక చర్యకు ముందు నెహ్రూ పాక్ ప్రధానికి టెలిగ్రామ్ మెసేజ్ పంపారు.