పెండింగ్ బిల్లులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై
పెండింగ్ బిల్లుల వ్యవహారంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గత కొద్దిరోజులుగా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు బిల్లులను గవర్నర్ పాస్ చేయలేదని తెలంగాణ సర్కార్ ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే తాజాగా మరోసారి పెండింగ్ బిల్లులపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు.నేను ఎవరికి వ్యతిరేకం కాదు, బిల్లులు ఎందుకు తిరస్కరించాననేది కారణాలు మాత్రమే చెప్పానంటూ గవర్నర్ తెలిపారు.గతంలోనే ఈ సమస్య తీవ్రదుమారం రేపింది.మళ్లీ ఈ సమస్య ఎటువైపు తిరగనుందో వేచి చూడాలి.