Telangana: లాస్ట్ మినిట్‌లో ట్విస్ట్.. మరో అభ్యర్థిని మార్చిన కాంగ్రెస్.. ఎవరంటే..
నారాయణఖేడ్ టికెట్ విషయంలో చివరి నిమిషంలో కాంగ్రెస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. సురేష్ షెట్కార్‌కు బదులుగా పటోళ్ల సంజీవ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది కాంగ్రెస్. దాంతో సంజీవ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సురేష్ షెట్కార్‌కు ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.