CDF Funds : సీడీఎఫ్ నిధులను కూడా ఖర్చు చేయని తెలంగాణ ఎమ్మెల్యేలు.. ఈ లెక్కలు చూస్తే షాకవుతారు..!!
నియోజకవర్గాలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ప్రతిఏటా నియోజవకర్గ అభివృద్ధి నిధులు (CDF) ఎమ్మెల్యేలకు మంజూరు చేస్తోంది. 2014 నుంచి తెలంగాణ ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికోసం రూ. 4,150కోట్ల నిధులు కేటాయించింది. కానీ కేవలం రూ. 1,641కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దీంతో రూ.611 కోట్లతో 17,683 ప్రాజెక్టులు నిలిచిపోయాయి. రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, కొన్ని రకాల పనులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రతిపాదనలు ఆలస్యమవుతున్నాయి. దీంతో ప్రాజెక్టుల నిర్వహణ నాసిరకంగా జరుగుతోంది. సకాలంలో ప్రతిపాదనాలు సమర్పించి పనులు పూర్తి చేయడంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విఫలమయ్యారని అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నిధుల్లో ఇప్పటివరకు కేవలం 40శాతం మాత్రమే అభివృద్ధికి ఖర్చు చేయడం వారి పనితీరుకు అద్దం పడుతోంది.