Telangana Elections: మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థిపై ఉత్కంఠ.. పోటీలో నిలిచేది ఆయనేనా?
తన కొడుక్కి ఎమ్మెల్యే సీటు కోసం బీఆర్ఎస్ను వీడిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.. రేపో మాపో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ రాజీనామా నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనేదే ఆసక్తికరంగా మారింది.