Telangana Elections: లైన్ దాటితే వేటే.. పార్టీలకు ఈసీ ఆదేశాలు!
ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులకే కీలక సూచనలు చేసింది ఎన్నికల సంఘం. ఒక్కొక్క అభ్యర్థి గరిష్టంగా రూ. 40 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. అదనంగా ఖర్చు చేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని.. సెక్షన్ 123(6) ప్రకారం అవినీతికి పాల్పడినట్లు కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించింది.