Telangana: రేపే పార్టీ అభ్యర్థులకు బీ ఫామ్లు పంపిణీ.. పదిమంది అభ్యర్థులకు కేసీఆర్ షాక్ ?
ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్.. 115 నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. నర్సాపూర్, జనగామ, గోషామహల్, నాంపల్లి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇటీవలే మల్కాజ్గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.. తన కుమారుడికి టికెట్ ఇవ్వలేదనే కారణంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు సీఎం కేసీఆర్ 5 నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15న ఆయన తెలంగాణ భవన్లో మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. అదే రోజు అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేయనున్నారు.