BREAKING: జుక్కల్, అందోల్, నల్గొండలో కాంగ్రెస్ గెలుపు
తెలంగాణలో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. తాజాగా జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మి కాంతారావు గెలిచారు.
తెలంగాణలో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. తాజాగా జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మి కాంతారావు గెలిచారు.
పార్టీ కోసం కష్టపడ్డ రేవంత్ రెడ్డి తమ సీఎం అని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన ప్రకటన చేశారు. మరో వైపు డీజీపీ అంజనీ కుమార్ తో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు రేవంత్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఖమ్మం - పువ్వాడ అజయ్, పాలకుర్తి-ఎర్రబెల్లి దయాకర్ రావు, నిర్మల్-ఇంద్రకరణ్ రెడ్డి, బాల్కొండ-వేముల ప్రశాంత్ రెడ్డి, ధర్మపురి - కొప్పుల ఈశ్వర్, మహబూబ్నగర్ - శ్రీనివాస్ గౌడ్, వనపర్తి - నిరంజన్ రెడ్డి ఓటమి దిశలో ఉన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ 3వ స్థానంలో ఉన్నారు.
హోరాహోరీగా సాగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఆ పార్టీ స్టేట్ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్, కామారెడ్డి రెండు సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. అయితే.. కామారెడ్డిలో కేసీఆర్ మూడో స్థానంలో ఉన్నారు.
సోషల్ మీడియాలో #RevanthReddy ట్రెండ్ అవుతోంది. మరో వైపు రేవంత్ అభిమానులు ఆయన ఇంటికి చేరుకుని సంబరాలు స్టార్ట్ చేశారు. పోలీసులు రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట భద్రతను పెంచారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఆ పార్టీ 65-70 సీట్లు సాధించడం ఖాయం కానుంది. ఈ రోజు సాయంత్రానికి గెలిచిన ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు హస్తం పార్టీ.
గెలిచిన అభ్యర్థులను వెంటనే క్యాంప్ కు తరలించేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ లోని హోటల్ తాజ్ కృష్ణాలో మూడు బస్సులను సిద్ధం చేసింది. గెలిచిన అభ్యర్థులను తొలుత హైదరాబాద్, అక్కడి నుంచి బెంగళూరుకు తరలించనుంది కాంగ్రెస్.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ దుమ్మురేపింది. 65సీట్లతో కాంగ్రెస్ విజయం సాధించింది. కేసీఆర్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇక కాంగ్రెస్ సీఎం రేపే ప్రమాణస్వీకారం చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తోంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో 'హ్యాట్రిక్ లోడింగ్.. గెట్ రెడీ టూ సెలబ్రేట్ గాయ్స్' అంటూ తాను తుపాకీ ఎక్కుపెట్టిన ఫోటోను ట్వీట్ చేశారు కేటీఆర్.