CM Revanth: త్వరలో దావోస్ కు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి!
జనవరి 15-19 మధ్య దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ సదస్సులో భాగంగా ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈవోలతో సీఎం సమావేశం కానున్నారు.
జనవరి 15-19 మధ్య దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ సదస్సులో భాగంగా ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈవోలతో సీఎం సమావేశం కానున్నారు.
అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తులను జిరాక్స్ షాపుల్లో అధిక ధరలకు మోసపోవద్దని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో కోరింది. ప్రజలు వారి గ్రామపంచాయతీ లేదా పట్టణ వార్డు కార్యాలయాల్లో ఈ దరఖాస్తులను ఉచితంగా పొందవచ్చని తెలిపింది.
పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణలో 10 ఎంపీ స్థానాల్లో గెలవాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. ఇందుకోసం ఎంపీ టికెట్ ఎవరికి కేటాయించాలనే దానిపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది.
త్వరలో ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ఎన్నిక కాబోతున్నారని జరుగుతున్న ప్రచారానికి ఏపీ కాంగ్రెస్ ఛీఫ్ గిడుగు రుద్రరాజు స్పందించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ వస్తే ఆహ్వానిస్తామని.. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు.
రూ.500లకే గ్యాస్ సిలిండర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికపై విధివిధానాలు రూపొందించి. కొత్త రేషన్ కార్డులు జారీ చేసే సమయంలోనే సిలిండర్ పథకానికి లింక్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 15 స్థానాల్లో విజయమే టార్గెట్ గా తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. 10 స్థానాల్లో అభ్యర్థులు దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. మరో 5, 6 స్థానాల అభ్యర్థులపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశానికి మాజీ ఎమ్మెల్సే మైనంపల్లి హన్మంతరావు హాజరుకాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీపై ఆయన ఏమైనా అలిగారా అన్న చర్చ సాగుతోంది.
ఆరు గ్యారెంటీల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ. ఈ నెల 28 నుంచి గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పకుండా పదవులు లభిస్తాయని హైకమాండ్ హామీ ఇచ్చిందన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ పర్యటకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో హైకమాండ్ తో చర్చించి నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ పోస్టులకు సంబంధించి పేర్లను ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అద్దంకి దయాకర్, షబ్బీర్ అలీకి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.