Telangana BJP CM: బీజేపీ గెలిస్తే సీఎం ఆయనేనా? ఆసక్తి రేపుతున్న అమిత్ షా ప్రకటన..!
తెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీ అభ్యర్థినే ముఖ్యమంత్రిగా నియమిస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన హాట్ డిస్కషన్‌కు తెరలేపింది. ఒకవేళ బీజేపీ గెలిస్తే సీఎం రేసులో నిలిచేది వీరే అంటూ కె. లక్ష్మణ్, ఈటల రాజేందర్, బండి సంజయ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతమైతే.. బీజేపీలో బలమైన బీసీ నేతలుగా వీరు ముగ్గురు చలామణి అవుతున్నారు. దీంతో వీరిలో ఎవరు సీఎం అవుతారు? అనే చర్చ నడుస్తోంది.