AP assembly:ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరిరోజున కీలక బిల్లులు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగుస్తాయి. ఐదు రోజులపాటూ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. చివరి రోజు సభలో రెండు కీలక బిల్లులను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగుస్తాయి. ఐదు రోజులపాటూ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. చివరి రోజు సభలో రెండు కీలక బిల్లులను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం ఫ్యాక్షన్ మనస్థత్వంతో విపక్ష పార్టీపై కక్ష సాధింపు రాజకీయాలకు దిగుతున్నారని ఆరోపించాడు.
రాజధాని అమరావతిపై చంద్రబాబు ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బందులు పడుతోందని కాగ్ తన నివేదికలో పరోక్షంగా తెలిపింది. రాజధాని కోసం భూ సేకరణ నిపుణుల కమిటీ సిఫార్సులను ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోలేదని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. నిపుణుల కమిటీ సిఫారసులను పరిగణలోనికి తీసుకొనకుండా, రాజధానికి అవసరమైన భూమి మొత్తంలో 70 శాతం భూ సమీకరణ విధానం ద్వారా సేకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రస్తుతం , రాబోయే కాలంలో భారీ ఆర్థిక భారం పడిందని కాగ్ తన నివేదికలో తెలిపింది. అలాగే జగన్ ప్రభుత్వం రాజధాని అమరావతి ప్రాంతంలో పనుల నిలుపుదల చేయడం వల్ల నిధులు నిరుపయోగం అయ్యాయని కాగ్ తన నివేదికలు తేల్చి చెప్పింది.
టీడీపీ అంటే ఒక కుటుంబమని, కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వారని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. కార్యకర్తలను ఉద్దేశించి ఆమె ఓ వీడియో విడుదల చేశారు. రాష్ట్రంలో టీడీపీ జెండా రెపరెపలాడటం కోసం కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 4వ విడత వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారయింది. వచ్చే నెల అక్టోబర్ 1నుండి పవన్ కళ్యాణ్ 4వ విడత వారాహి యాత్ర సార్ట్ కానుంది. రాష్ట్రంలోని తాజా పరిణామాలతో జనసేనాని దూకుడు పెంచారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీ సిద్ధాంతాలను, భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడానికి జిల్లాల వారీగా కార్యకర్తలతో సమావేశాలను నిర్వహిస్తూ జనసైనికుల్లో జోష్ పెంచుతున్నారు.
చంద్రబాబు నాయుడు ఆదేశాలతో టీడీపీ రాజకీయ కార్యక్రమాల పర్యవేక్షణకు పొలిటికల్ యాక్షన్ కమిటీని నియమించినట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. కమిటీలో నారా లోకేష్, నందమూరి బాలకృష్ణతో పాటు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, పయ్యావుల కేషవ్, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్రయాదవ్ తో పాటు మరో 9 మందికి అవకాశం కల్పించారు.
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా నంద్యాలలో మాజీ మంత్రి అఖిలప్రియ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ రోజు తెల్లవారుజామున అఖిల, తమ్ముడు విఖ్యాత్, భర్త భార్గవ్రామ్ని అరెస్ట్ చేశారు. అనంతరం ఆళ్లగడ్డలోని వారి ఇంటికి తరలించారు.
చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనను కస్టడికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబును సీఐడీ 5 రోజుల కస్టడీకి కోరింది. కానీ ఏసీబీ కోర్టు 2 రోజుల కస్టడీకి మాత్రమే అనుమతి ఇచ్చిది.