TDP vs Police: మైలవరంలో టెన్షన్.. పోలీసులు, టీడీపీ నేతల మధ్య ఘర్షణ
వైసీపీ ఇసుక దోపిడికి పాల్పడుతుందని ఆరోపిస్తూ టీడీపీ నిరసనలకు దిగింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో టీడీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం అక్కడి టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. మైలవరంలోని ఇసుక డంపింగ్ స్టాక్ పాయింట్ వద్ద టీడీపీ నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమా, తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి శావల దేవదత్ నిరసనకు దిగగా పోలీసులు అడ్డుకున్నారు.