Yuvraj Singh : వెండితెరపైకి యువరాజ్ సింగ్ బయోపిక్.. నటించేది ఎవరంటే?
ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ జీవితకథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కబోతోంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణసంస్థ టీ సిరీస్ ఈ బయోపిక్‌ను రూపొందించనుంది. నిర్మాతలు భూషణ్ కుమార్, రవిభాగ్ చందక్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఇందులో హీరోగా ఎవరు కనిపిస్తారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.