స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు....1800 మంది అతిథులు... స్పెషల్ సెల్ఫీ పాయింట్స్...!
భారత స్వాతంత్ర్య వేడుకలను ఈ సారి అత్యంత ఘనంగా నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రత్యేక అతిథులకు కేంద్రం ఆహ్వానం పంపింది. జన్ భాగీదారి కార్యక్రమంలో భాగంగా ఈ సారి వేడుకలకు సుమారు 1800 మంది ప్రత్యేక అతిథులకు ఆహ్వానం పంపినట్టు అధికారులు వెల్లడించారు.