YS Sharmila: ఆడుదాం ఆంధ్ర అంటూ వైసీపీ ప్రభుత్వం ఇలా చేస్తోంది : షర్మిల
వైసీపీ సర్కార్ పై APCC చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అన్నింటిలో నీచ రాజకీయాలు చేస్తున్న వైసీపీ.. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అంటూ క్రీడలపై కూడా దౌర్భాగ్య రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆటగాళ్ల భవితను, ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.