Kumbham Anil: కాంగ్రెస్ లోకి కుంభం అనిల్ కుమార్ రెడ్డి.. కోమటిరెడ్డితో సయోధ్య కుదిరిందా?
ఇటీవల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరనున్నారు. రేవంత్ రెడ్డి స్వయంగా అనిల్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.