కొంపముంచిన రీల్ వీడియో.. కటకటాల్లోకి తల్లీకూతుళ్లు..
సోషల్ మీడియా మోజులో పడి చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరు రీల్స్ చేస్తున్నారు. ఇలా రీల్స్ చేస్తూ చాలామంది తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలన్న ఆశతో డేంజర్ స్టంట్స్ చేస్తున్నారు. ఇక యువత అయితే రీల్స్‌తో తోటివారికి ఇబ్బంది కలిగిస్తుంటారు. ఇలాంటి ఘటనల్లో నిషేధ ప్రదేశాల్లోనూ రీల్స్ చేస్తూ జైలు పాలయిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఆగ్రా ఫోర్ట్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.