ఏ పేరైనా పర్వాలేదు...ఇండియా పేరు మార్పు మీద రాహుల్ గాంధీ కామెంట్స్
ఇండియా, భారత్ ఏ పేరైనా పర్వాలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఓ యూనివర్శిటీ విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ఇండియా, భారత్ ఏ పేరైనా పర్వాలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఓ యూనివర్శిటీ విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీ రక్షా బంధన్ రోజున రాఖీ కట్టారు. కావాలంటే చూడండి అంటూ ఆమె కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. '' మీ కళ్లు, మెదడు రెండింటికి కూడా చికిత్స చేయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ ఆమె పేర్కొన్నారు.
ఓరాజస్థాన్‌లోని దుంగార్పూర్లో బీజేపీ 'పరివర్తన్ సంకల్ప్ యాత్ర'లో పాల్గొన్నారు అమిత్ షా. ఈ సందర్బంగా ప్రసంగించిన ఆయన.. విపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి గత రెండు రోజులుగా సనాతన ధర్మాన్ని అవమానిస్తోందని, కేవలం టు బ్యాంకు రాజకీయాల కోసమే డీఎంకే, కాంగ్రెస్ నేతలు సనాతన ధర్మంపై విమర్శలు చేస్తున్నారన్నారు.
రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందన్నారు. కేసీఆర్ అవినీతిని ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు
రాజకీయాలతో బిజీగా బిజీగా గడిపే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ..కొంత కాలంగా ప్రజలతో మమేకం అవుతూ కనిపిస్తున్నారు. మొన్న లఢఖ్ లో సందడి చేసిన రాహుల్...తాజాగా ఊటీలోని చాక్లెట్ ఫ్యాక్టరీలో దర్శనమిచ్చారు. అక్కడ కార్మికులతో కలిసి చాక్లెట్ ఎలా తయారు చేస్తారో నేర్చుకుని...తాను కూడా ఒక చాక్లెట్ రెడీ చేశారు. రాహుల్ చాక్లెట్ తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన తన అభిమానులు, పార్టీ కార్యకర్తలు..మా నేత ఆల్ రౌండర్ అంటూ తెగ మురిసిపోతున్నారు.
తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్లిస్ట్ రెడీ అయ్యింది. ఈ లిస్ట్‌లో 50 మంది అభ్యర్థులు ఉన్నారని సమాచారం ఈ జాబితాను కాంగ్రెస్ పార్టీ స్ట్రీమింగ్ కమిటీకి పంపింది. దీనిని క్షుణ్ణంగా పరిశీలించిన కమిటీ సీఈసీకి పంపనుంది. సీఈసీ ఆమోదం అనంతరం సెప్టెంబర్‌లో కాంగ్రెస్ పార్టీ ఈ జాబితాను వెళ్లడించనుంది.
జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ గ్రాఫ్ ఓ రేంజ్లో పెరిగిందని 'ఇండియా టుడే-సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్' తేల్చింది. 'INDIA' కూటమిని ముందుండి నడిపించేది రాహులేనని సర్వే చెబుతోంది. 24శాతం మంది రాహుల్ 'INDIA' కూటమి లీడ్ చేస్తాడని అభిప్రాయపడగా.. చెరో 15శాతం మంది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ సీఎం మమత నాయకత్వం వహిస్తారని తెలిపారు.
ప్రధాని మోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్ లోని ఒక అంగుళం భూమిని కూడా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) ఆక్రమించలేదని ప్రధాని మోడీ అన్నారని చెప్పారు. కానీ ఆ మాటల్లో నిజం లేదన్నారు. మన దేశంలోని చైనా సైనికులు ప్రవేశించారని స్థానికులు సైతం చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.
దేశంలోని ప్రతి సంస్థలోనూ ఆర్ఎస్ఎస్ తమ సొంత వ్యక్తులను చొప్పిస్తోందన్నారు. కేబినెట్ లో నిర్ణయాలు తీసుకుంటున్నది మంత్రులు కాదన్నారు. మంత్రి వర్గంలో ఏం జరగాలనేది ఆర్ఎస్ఎస్ కు చెందిన ఓ పెద్ద మనిషి నిర్ణయిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రులను అడిగినా నిజం చెబుతారన్నారు. తాము తమ మంత్రిత్వ శాఖలను నడపడం లేదని కేంద్ర మంత్రులు చెబుతారని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ నియమించిన వ్యక్తులు ఆ మంత్రిత్వ శాఖలను నడుపుతున్నారని చెప్పారు.