BiggBoss ప్రియాంక సింగ్ ఇంట విషాదం.. తండ్రి చనిపోయారని ఎమోషనల్ పోస్ట్!
బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి బీబీ సింగ్ ఈరోజు తెల్లవారుజామున మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రియాంక సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎమోషనలైంది.