CM Revanth: కేంద్రమంత్రులతో సీఎం రేవంత్ భేటీ.. ఆ బకాయిలపై కీలక చర్చ!
ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి జోషిని తెలంగాణ సీఎం రేవంత్ కోరారు. గ్యాస్ రాయితీని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ముందే చెల్లించే అవకాశాన్ని కల్పించాలని హర్ దీప్ సింగ్ ను విజ్ఞప్తి చేశారు.