Rocket Attack : ప్రధాని ఇంటి పై రాకెట్ దాడి!
రాజకీయ అస్థిరతతో కుదేలవుతున్న లిబియా లో మరో కలకలం రేగింది. దేశ ప్రధాని అబ్దుల్ హమీద్ అల్ దబేజా ఇంటి పై ఆదివారం రాకెట్ గ్రనేడ్ దాడి జరిగింది. దీంతో ప్రధాని నివాస భవనం స్వల్పంగా దెబ్బతింది.
రాజకీయ అస్థిరతతో కుదేలవుతున్న లిబియా లో మరో కలకలం రేగింది. దేశ ప్రధాని అబ్దుల్ హమీద్ అల్ దబేజా ఇంటి పై ఆదివారం రాకెట్ గ్రనేడ్ దాడి జరిగింది. దీంతో ప్రధాని నివాస భవనం స్వల్పంగా దెబ్బతింది.
ఇటలీ ప్రధానమంత్రి మెలోని డీప్ ఫేక్ కేసులో తనకు లక్ష యూరోలు చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ డీప్ ఫేక్ వీడియోలను సృష్టించిన ఇద్దరు తండ్రీకొడుకులను ఇటలీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇప్పుడు వారే తనకు జరిమానా కట్టాల్సిందేనని మెలోనీ అంటున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టిలు ఈరోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కలవనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ ప్రధానిని కలవడం ఇదే మొదటిసారి. ఈరోజు మధ్యాహ్నం 4.30 గంటలకు మోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన వినతులను అందజేయనున్నారు.
ఆర్టికల్ 370 రద్దు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలు హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ ఏకత్వాన్ని సుప్రీం తీర్పు మరో సారి చాటి చెప్పిందని ప్రధాని మోదీ అన్నారు.
వాళ్ళంతే.. 70 ఏళ్ళుగా అలవాటైన పద్ధతిని వదులుకోలేరు. వారి విభజన సిద్ధాంతంతో మనమంతా జాగ్రత్తగా ఉండాలి అంటూ కాంగ్రెస్ కు చురకలు అంటించారు ప్రధాని మోదీ. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ అనుకూలవాదులు బీజేపీ గెలుపు మీద చేసి వ్యాఖ్యలకు ఇలా కౌంటర్ వేశారు.
తెలంగాణలో బీజేపీ కొత్త చరిత్ర లిఖించబోతోందని అన్నారు ప్రధాని నరేంద్రమోదీ. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు స్వస్తి పలకనున్నారని అన్నారు. మహబూబాబాద్ బీజేపీ బహిరంగ సభలో మోదీ మాట్లాడారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మీద భారత ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో ఫోన్ లో మాట్లాడారు. ద్విదేశ పరిష్కారాన్ని పునరుద్ఘాటించారు.