Raksha Bandhan : ప్రధాని మోదీకి రాఖీకట్టిన విద్యార్థులు..!!
రక్షాబంధన్‌ను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. న్యూఢిల్లీలోని తన నివాసంలో పాఠశాల విద్యార్థులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ రక్షా బంధన్‌ను జరుపుకున్నారు. ప్రధాని మోదీ ప్రతి సంవత్సరం రక్షా బంధన్ పండుగను పాఠశాల బాలికలకు రాఖీ కట్టడం ద్వారా జరుపుకుంటారు. అంతకుముందు, ప్రధాని దేశప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ పండుగ మన సంస్కృతికి పవిత్ర ప్రతిబింబమని ప్రధాని మోదీ అన్నారు.