గుడ్న్యూస్.. 8.5 కోట్లమంది రైతులకు మోదీ కానుక...నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నగదు జమ..!!
రైతులకు గుడ్ న్యూస్...నేడు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 14వ విడతను ప్రధానమంత్రి నరేంద్రమోదీ విడుదల చేయనున్నారు. ఇవాళ రాజస్థాన్లోని సికార్ లో మోదీ డీబీటీ ద్వారా దేశంలోని 8.5కోట్ల మంది రైతులకు అకౌంట్లలోకి సుమారు రూ. 17,000కోట్లను బదిలీ చేయనున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 11 కోట్ల మందికిపైగా రైతులకు రూ.2.42 లక్షల కోట్లకు పైగా లబ్ధి చేకూరింది.