Revanth Reddy: సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డికి చుక్కెదురు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు అతినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని, అది ఎన్నికల కమీషన్ కిందకు వస్తుందని దాఖలైన పిటీషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో దీనిపై రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని స్పష్టం చేస్తూ రేవంత్ రెడ్డి వేసిన పిటీషన్ను కొట్టివేసింది.