PawanKalyan: మనల్ని ఎవడ్రా ఆపేది.. పవర్‌స్టార్ బర్త్‌డే స్పెషల్..
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరు వింటేనే అభిమానులకు ఓ వైబ్రేషన్. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతారు. సినిమా హిట్టా? ఫట్టా? అని పట్టించుకోరు.. వెండితెరపై తమ అభిమాన హీరోను చూస్తే చాలంటూ సంబరపడిపోతుంటారు. ఇక కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అంటూ బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తుంటారు. తమ ఆరాధ్య హీరో, నాయకుడైన పవన్‌కల్యాణ్‌ను ఒక్కసారైనా ప్రత్యక్షంగా కలవాలని, కళ్లారా చూడాలని పరితపిస్తుంటారు.
పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. ఎన్నికల వరకూ ఇక అక్కడే!!
పవన్ మొత్తానికి మంగళగిరికి షిఫ్ట్ అవుతున్నట్లుగా సమాచారం. ఇక్కడి నుంచే పార్టీకి సంబంధించి కార్యకలాపాలు కొనసాగించాలని ఆయన భావిస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీని ఓడించే లక్ష్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు పవన్ కళ్యాణ్ స్వయంగా అన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి పార్టీ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న పవన్ కళ్యాణ్..