Pakistan : పాకిస్తాన్ పార్లమెంట్ రద్దు...షాబాజ్ ఉద్దేశం ఏంటో తెలుసా?
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ నిర్ణీత గడువు పూర్తి కావడానికి ఇంకా మూడు రోజుల ఉండగా..జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలంటూ అధ్యక్షుడు అరీఫ్ అల్వికి ప్రధాని షెహబాజ్ షరీఫ్ విజ్ఞప్తి చేశారు. సభ్యుల మద్దతుతోనే ఈ విషయం చెప్పాలని భావిస్తున్నానని చెప్పడంతో బుధవారం రాత్రి పాక్ జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. దీంతో పాకిస్తాన్ లో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి.