Telangana Elections 2023: ఎన్నికల్లో పోటికి దరఖాస్తు చేసుకోని బీజేపీ సీనియర్లు.. కారణం ఏంటంటే?
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించగా, బీజేపీ , కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానించారు . దీంతో బీజేపీ తరపున పోటీ చేసేందుకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. టికెట్ల కోసం రికార్డు స్థాయిలో 6 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోవడం విశేషం. అయితే ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపి జితేందర్ రెడ్డి మినహా మిగిలిన సీనియర్లు అప్లై చేసుకోకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎంపీగా ఉన్నవాళ్లు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేయాలని హైకమాండ్ గతంలోనే చెప్పింది. అయినా కూడా సీనియర్లు దరఖాస్తు చేసుకోలేదు.