Chandrababu: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈనెల 29 మధ్యాహ్నం 2.15గంటలకు విచారణను వాయిదా వేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో దారుణం..అర్ధనగ్నంగా తీవ్ర రక్తస్రావంతో చిన్నారి నరకయాతన..!!
సమాజంలో చిన్నారులపై కామాంధుల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒకచోట వారిపై లైంగిక దాడులు, అత్యాచారాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా,12 ఏళ్ల బాలిక అర్ధనగ్న స్థితిలో, తీవ్ర రక్తస్రావం అవుతున్న పరిస్థితులో సాయం కోరింది. కనిపించిన ప్రతి వ్యక్తిని సహాయం కోరింది. ప్రదర్శన చూసినట్టు చూశారే తప్ప సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ దారుణమైన సంఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని సమీపంలో చోటుచేసుకుంది.
2018 Movie: ఆస్కార్‌కు భారత్ తరపున అధికారికంగా ఎంపికైన మలయాళం మూవీ
ఆస్కార్ అవార్డు కోసం ఈ ఏడాది అధికారికంగా ఒకే ఒక్క చిత్రం భారత్ తరపున ఎంపికైంది. గతేడాది 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో యావత్ ప్రపంచం భారత సినిమాల వైపు చూడటం మొదలుపెట్టింది. ప్రపంచంలో ఏ మూలన చూసినా నాటు నాటు ఎంతలా మార్మోగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Breaking: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా
టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్‌లతో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు రాగా.. విచారణకు భట్ విముఖత వ్యక్తం చేశారు. దీంతో ఈ కేసు మరో బెంచ్‌కు బదిలీ అయింది. వరుస సెలవుల నేపథ్యంలో వచ్చే వారం విచారణ చేపట్టే అవకాశం ఉంది.
KCR: వారం రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ వారం రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసీఆర్ అనారోగ్యం గురించి తెలుసుకున్న అభిమానులు, నెటిజన్లు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
Chandrashekar: మాట వినని జర్నలిస్టులను 'టీ' కి పిలవండి.. వైరల్ గా మారిన బీజేపీ స్టేట్ చీఫ్ కామెంట్స్
జర్నలిస్టులను టీ తాగడానికి తీసుకెళ్లండి.. అంటూ మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అహ్మద్‌నగర్‌లో బీజేపీ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసేలా వార్తలు రచించే జర్నలిస్టుల లిస్ట్ ను రెడీ చేయండీ వారిని టీ పార్టీకు పిలుద్దాం అంటూ సెటైర్ వేసిన ఓ ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది.
TSPSC Group-1: గ్రూప్-1 పరీక్ష రద్దుపై హైకోర్టులో విచారణ.. కమిషన్ తీరుపై తీవ్ర ఆగ్రహం
తెలంగాణలో గ్రూప్-1 పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ను టీఎస్పీఎస్సీ ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ను ఈ రోజు విచారణకు చేపట్టింది న్యాయస్థానం. పరీక్ష నిర్వహణ విషయంలో ఎన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తారంటూ ప్రశ్నించింది. విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.
Nara Lokesh: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 గా నారా లోకేష్.. అరెస్ట్ తప్పదా?
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చుట్టు ఉచ్చు బిగిస్తున్నారు సీఐడీ అధికారులు. ఈ కేసులో లోకేష్ ను A14 గా చేరుస్తూ హైకోర్టు లో ఏపీ సీఐడీ ఈ రోజు మెమో దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో