Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో కన్నీటి దృశ్యాలు..!!
దేశం కోసం కదనరంగంలోకి దిగిన ఇజ్రాయెలీ జర్నలిస్టు తన భార్యకు వీడ్కోలు పలికిన వీడియో వైరల్ గా మారింది. యుద్ధానికి వెళ్తున్న నఫ్తాలీ.. తన భార్యను హత్తుకుని ఎమోషనల్ అయ్యారు. భర్త యుద్దానికి వెళ్తుండడంతో ఆ భార్య బోరున విలపిస్తోంది. యుద్దానికి వెళ్తే భర్త తిరిగి వస్తాడో రాడో అన్న భయంతో కన్నీటి పర్యంతమవుతోంది. భర్తను యుద్ధానికి పంపించడం ఇష్టం లేకపోయిన దేశాన్ని రక్షించుకునేందుకు వెనకడుగు వెయకుండా భర్తకు సెండాఫ్ ఇచ్చింది.