JEE Main Exam: రేపటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు..
రేపటి నుంచి దేశవ్యాప్తంగా 291 నగరాల్లో జేఈఈ మెయిన్ - 2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 నుంచి 12 వరకు జరిగే ఈ పరీక్షలకు దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
రేపటి నుంచి దేశవ్యాప్తంగా 291 నగరాల్లో జేఈఈ మెయిన్ - 2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 నుంచి 12 వరకు జరిగే ఈ పరీక్షలకు దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లోని ఓ టైలరింగ్ షాప్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మంటలు ఆర్పేశారు. ఆ కుటుంబ సభ్యులు అగ్నిప్రమాదపు పొగ పీల్చుకొని మృతి చెందినట్లు సమాచారం.
కేరళలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు.. టికెట్ చూపించమని అడిగిన టీటీఈని రైలు నుంచి కిందకి తోసేశాడు. దీంతో అటువైపు నుంచి వస్తున్న మరో రైలు టీటీఈని ఢీకొనడంతో అతడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇంటి భోజనంతో సహా.. పుస్తకాలు, పెన్నులు, జపమాలకు అనుమతివ్వాలని రౌస్ అవెన్యూ కోర్టు అధికారులకు మరోసారి ఆదేశాలిచ్చింది. అలాగే భోజనం, పరుపు, దుప్పట్లు తెచ్చుకునేందుకు, ఆభరణాలు ధరించేందుకు కూడా పర్మిషన్ ఇవ్వాలని చెప్పింది.
తెలంగాణలో రాబోయే మరో రెండు రోజుల పాటు వడగాలులు వీచే అవకాశాలున్నాయని హెదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి బ్యాగులో కుక్కి.. మృతదేహాలను రెండురోజుల పాటు తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఆ తర్వాత ఇంటి నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు రంగప్రవేశం చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
కొత్త నైపుణ్యాలు నేర్చుకునేందుకు సింగపూర్లో 40 ఏళ్లు దాటినవారు మళ్లీ యూనివర్సిటీల బాట పడుతున్నారు. వీరికోసం అక్కడ పూర్తికాల డిప్లొమా కోర్సును కూడా రూపొందించింది సింగపూర్ ప్రభుత్వం. అంతేకాదు.. 40 ఏళ్లు దాటిన వారు ఈ కోర్సులు చేసేందుకు 90 శాతం ఫీజు రాయితీ కూడా ఇస్తోంది.
కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయని..అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై కసరత్తులు చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.