National Film Awards: అటు ఆస్కార్.. ఇటు నేషనల్ అవార్డ్..ఒకే ఏడాదిలో డబుల్ ధమాకా!
ఒకే ఏడాదిలో రెండు బెస్ట్ అవార్డులు కొల్లగొట్టారు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సినీగేయ రచయిత చంద్రబోస్. ఈ ఏడాది మార్చిలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు గెలుకున్న ఈ ఇద్దరూ..తాజాగా జాతీయ అవార్డునూ గెలుచుకున్నారు. కొండపొలం సినిమాలోని 'ధమ్ ధమా ధమ్' పాటకు సాహిత్యం అందించిన చంద్రబోస్‌ను జాతీయ అవార్డు వరించింది. బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్ కేటగిరిలో కీరవాణికి జాతీయ అవార్డు లభించింది.