MP Bharat: రాజమండ్రి స్వచ్చత.. ప్రతీ ఒక్కరి బాధ్యత
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో స్వచ్చతాహి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ భరత్.. చీపురు పట్టుకొని వీధులను శుభ్రం చేశారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో స్వచ్చతాహి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ భరత్.. చీపురు పట్టుకొని వీధులను శుభ్రం చేశారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులో నారా లోకేష్ చక్రం తిప్పారని ఏసీ సీఐడీ ఆరోపిస్తోంది. దీంతో లింగమనేని భూముల ధరలు రూ.700 కోట్లు పెరిగాయని చెబుతోంది. ఇంకా నాటి మంత్రి నారయణతో పాటు హెరిటేజ్ సంస్థకు కూడా ప్రయోజనం చేకూరిందని చెబుతోంది.
సీఎం జగన్‌పై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అవినీతి జరుగలేదని జగన్‌కు తెలిసి కూడా చంద్రబాబును అరెస్ట్ చేయించారన్న ఆయన.. టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్‌కు వస్తున్న ప్రజా స్పందన చూసి ఓర్వలేక పోతున్నారన్నారు.
నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ టీడీపీ పిలుపునిచ్చిన మోత మోగిద్దాం కార్యక్రమంలో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్దతుగా ఈల ఊదారు, డబ్బులు వాయించారు. రాజమండ్రిలో లోకేష్ క్యాంపు వద్ద ఏర్పాటు చేసిన 'మోత మోగిద్దాం' కార్యక్రమంలో జనాలతో కలిసి భువనేశ్వరి, బ్రాహ్మణి పాల్గొన్నారు.
ఏపీ సీఐడీ అధికారులు నారా లోకేష్ కు నోటీసులు పంపించారు. లోకేష్ వాట్సాప్ కు 41 ఏ కింద నోటీసును పంపించారు. ఇందుకు నారా లోకేష్ సైతం స్పందించారు. నోటిసులు అందుకున్నానంటూ సీఐడీ అధికారులకు సమాధానం ఇచ్చారు.
చంద్రబాబుకు (Chandrababu) మద్దతుగా ఈ రోజు రాత్రి 7 గంటల ఉంచి 7:05 వరకు శబ్ధం చేస్తూ తెలపాలని నారా లోకేష్ (Nara Lokesh) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొంటారా? లేదా అన్న అశంపై రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
ఒక వేళ నారా లోకేష్ అరెస్ట్ జరిగితే.. టీడీపీ పగ్గాలను తనకు అత్యంత విధేయుడు, నమ్మకస్తుడు అయిన యనమల రామకృష్ణుడికే అప్పగించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. చంద్రబాబును నిన్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, మాజీ మంత్రి నారాయణ కలిశారు. ఆ సమయంలో చంద్రబాబు యనమల పేరును సూచించినట్లు సమాచారం.
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తాజాగా ఏపీ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. ఆయనకు మద్దతుగా శనివారం రాత్రి 7 నుంచి 7.05 నిమిషాల వరకు శబ్ధం చేస్తూ నిరసన తెలపాలని కోరారు. ఎక్కడ ఉన్నా కూడా బయటకు వచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటెతో కొట్టాలని కోరారు. లేదా విజిల్ వేయాలన్నారు.