లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జనగామ మున్సిపల్ కమిషనర్
రూ.40 వేల లంచం తీసుకుంటూ జనగామ మున్సిపల్ కమిషనర్ రజిత ఏసీబీకి పట్టుబడ్డారు. కలెక్టరేట్ ఎదుట జీప్లస్-3 భవన నిర్మాణం చేపట్టగా అందులోనే 10 శాతం స్థలాన్ని మున్సిపాల్టీకి మార్ట్గేజ్ చేశారు. దానిని విడిపించేందుకు కమీషన్ తీసుకున్న రజితపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.