ఇండియా చేరుకున్న జేడీ వాన్స్ దంపతులు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో వాన్స్ భేటీ కానున్నారు. వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రతతో వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.