Chiranjeevi: చిరుతో ముగ్గురు టాప్ డైరెక్టర్స్..! ఆ సినిమాల లిస్ట్ ఇదే..?
భోళా శంకర్ తర్వాత మెగాస్టార్ తెలుగు ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్స్ అయిన ఆ ముగ్గురి తో సినిమాలకు ఒకే చెప్పారు. ప్రస్తుతం వాటి పనుల్లో బిజీగా ఉన్నారు.
భోళా శంకర్ తర్వాత మెగాస్టార్ తెలుగు ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్స్ అయిన ఆ ముగ్గురి తో సినిమాలకు ఒకే చెప్పారు. ప్రస్తుతం వాటి పనుల్లో బిజీగా ఉన్నారు.
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో సీనియర్ రైటర్ సత్యానంద్ ను అభినందిస్తూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. సత్యానంద్.. సినిమా రంగంలో 50 వసంతాలు పూర్తిచేసుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సత్యానంద్ కు శుభాకాంక్షలు తెలుపుతూ.. మరో 50 ఏళ్లు ఇదే ఎనర్జీతో ఉండాలని కోరుకుంటున్నానంటూ తెలిపారు.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. చిరంజీవి ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు తమ వంతు సాయం చేస్తున్న అక్కాచెల్లెళ్లు, అభిమానులకు, సోదరులకు శాల్యూట్ చేస్తున్నానని చెప్పారు. మన దేశానికి మనం చేస్తున్న చిరు సాయమిదని అన్నారు. సాయం చేస్తే వచ్చే సంతృప్తిని మాటల్లో చెప్పలేమని తెలిపారు.
కర్నూలు జిల్లాకు చెందిన మోదీన్ బీ (32)కి అనంతపురంలోని పీసీ ప్యాపిలికి చెందిన కానిస్టేబుల్ వన్నూరు స్వామితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఇంతవరకూ వారికి పిల్లలు కలగ లేదు. దీంతో పిల్లల కోసం అనంతపురంలోని ఓ ఆస్పత్రిలోని గైనకాలజిస్టును సంప్రదించారు. ఆమె ఐవీఎఫ్ ద్వారా సంతానం కలిగేలా చికిత్స చేస్తానని నమ్మ బలకడంతో, కుటుంబ సభ్యులు ఆమె మాటలు నమ్మారు. ఏవేవో టెస్టుల పేర్లు చెప్పి.. మూడు నెలలుగా ఆసుపత్రి సిబ్బంది చికిత్స అందించారు. మంగళవారం మధ్యాహ్నం సర్జరీ కోసమని మోదీన్ బీని ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లారు. లోపలికి తీసుకెళ్లే ముందే మోదీన్ బీకి ఓ మందు ఇవ్వగా.. అది వికటించి నిమిషాల వ్యవధిలోనే మృతి చెందింది.
మెగాస్టార్ చిరంజీవి మంచి దూకుడు మీద ఉన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా రెండుకొత్త సినిమాలను ప్రకటించారు. ఎంటర్ టైన్ మెంట్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే ఇందులో ఎలాంటి పొలిటికల్ అంశాలు, కాంట్రవర్సీలు లేకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా. తమన్న, కీర్తిసురేష్, సుశాంత్ లాంటి స్టార్ నటీనటులు ఉన్న సినిమా. ప్రమోషన్ కూడా గ్రాండ్‌గా చేశారు. కానీ ఓపెనింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు.
మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ ఇవాళ థియేటర్లలోకి వస్తోంది. అమెరికాతోపాటు మరికొన్ని ఓవర్సీస్ లొకేషన్లలో ప్రీమియర్ షోలు నడిచాయి. మరి ఈ మూవీ టాక్ ఏంటో తెలుసుకుందామా?
పవన్ కళ్యాణ్, చిరంజీవిలపై కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, పవన్ లు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. చిరంజీవి కూడా జనసేన పార్టీలో చేరతారని తాను ముందే చెప్పానని కేఏ పాల్ పేర్కొన్నారు. బీజేపీతో జనసేన పార్టీ ఎందుకు పొత్తు చేసుకుందంటే.. ఇన్ కమ్ టాక్స్ ఎగ్గొట్టడానికి కే అని వ్యాఖ్యానించారు. మోడీ, చంద్రబాబు, కేసీఆర్ లకు గుండు గీస్తానని ఘాటు వ్యాక్యలు చేశారు పాల్. బీజేపీ బీ పార్టీలను ఓడిస్తానని చెప్పారు. అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్, జెడీ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ నాగేశ్వర్, జయ ప్రకాష్ నారాయణ లాంటి మేధావులు కేవలం యాంకర్లుగా మిగిలిపోవద్దు కేఏ పాల్ విజ్ఞప్తి చేశారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా టికెట్లపై రచ్చ కొనసాగుతూనే ఉంది. రేట్లు పెంచుకునేందుకు చిత్ర యూనిట్ అనుమతి కోరగా..సినిమా నిర్మాణ వ్యయంపై డాక్యుమెంట్లు ఇవ్వాలని ప్రభుత్వం కోరుతోంది. పత్రాలు సమర్పిస్తే రేట్లు పెంచుకోవచ్చంటోంది సర్కార్. సినిమా బడ్జెట్ రూ.100కోట్లు దాటితేనే రేట్ల పెంపునకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. బడ్జెట్‌ని బట్టి సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉందని స్పష్టం చేసింది.