AP Crime: అన్నమయ్య జిల్లాలో దారుణం.. వైద్యం వికటించి రోగి మృతి
డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. వైద్యం వికటించినందునే వెంకటేష్ మృతి చెందాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.