Accident : ఒళ్లు గగుర్లుపొడిచే యాక్సిడెంట్.. గాల్లో పల్టీలు కొట్టిన కారు!
తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమంగళం సమీపంలోని శివరకోట్టై వద్ద విరుదునగర్-మదురై హైవేపై వేగంగా దూసుకెళ్తున్న కారు బైకును తప్పించబోయి పల్టీలు కొట్టింది. కారులో ఉన్న ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు, బైకిస్ట్ అక్కడికక్కడే మృతి చెందారు.