మార్చి నెల మొదటి రోజే ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. పెరిగిన సిలిండర్ ధరలు!
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం (మార్చి 1) నుంచి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.25.50 పెంచాయి. ఈ పెరుగుదల తర్వాత, దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ రూ.1795కి అందుబాటులో ఉంది. ఎల్పీజీ సిలిండర్ ధర పెంచడం ఇది రెండోసారి.