Delhi Services Bill : నాలుగు కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర..!
ఢిల్లీ సర్వీసెస్ బిల్లు (Delhi Services Bill)కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Dropuadi Murmu)ఆమోద ముద్ర వేశారు. ఢిల్లీలో ఉద్యోగుల నియామకాలు, బదిలీల అధికారాన్ని లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు కట్టబెట్టేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుకు ఇటీవల పార్లమెంట్ ఆమోదం తెలిపింది. తాజాగా రాష్ట్రపతి ఆమోదం కూడా లభించడంతో ఆ బిల్లు చట్టంగా మారనుంది. ఈ బిల్లుతో పాటు మరో మూడు కీలక బిల్లులకు కూడా రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.